పీసీసీ సభ్యుడిగా మెగాస్టార్ చిరంజీవి
- October 06, 2017
అమరజహా బేగ్ స్థానంలో నియామకం
జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా రాజ్య సభ సభ్యుడు చిరంజీవి నియమితులయ్యారు. జిల్లాల వారీగా పీసీసీ సభ్యులను నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 17 మంది సభ్యులను నియమించారు. ముందుగా కొవ్వూరు బ్లాక్–1 పీసీసీ సభ్యురాలిగా కాపవరం పంచాయతీ సర్పంచ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఎండీ.అమరజహా బేగ్‌ను నియమించారు.
అయితే రాజ్య సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా స్థానం కావాలని కోరడంతో అమరజహా బేగ్ తన స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించాలని సూచించారు. దాంతో చిరంజీవిని కొవ్వూరు బ్లాక్–1 పీసీసీ సభ్యుడిగా నియమించారు. గురువారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మహమ్మద్ రఫీఉల్లా బేగ్ విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడలో పీసీసీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నామని, అనంతరం పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు.
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జిల్లా నుంచి సభ్యత్వం కావాలని కోరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఆయన కోసం తన పీసీసీ పదవిని వదులుకున్న అమరజహా బేగ్‌ను ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో నాయకులు గెడ్డం సాయిబాబు, ఎం.థామస్, అజర్త్, రిజ్వన్, దాసు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







