1,000 కిలోల ఆహార పదార్ధాలు నాశనం చేసిన ఢోఫర్ మున్సిపాలిటీ

- October 06, 2017 , by Maagulf
1,000 కిలోల ఆహార పదార్ధాలు నాశనం చేసిన ఢోఫర్  మున్సిపాలిటీ

మస్కట్ : ' కలిపి కొట్టరా...కావేటి రంగా ' అని మస్కట్ లో వ్యాపారులు మస్కా కొట్టలేరు.. వేపుళ్ళు మాటున కుళ్ళిన మాంసాలను అమ్మడం...వేడి వేడిగా పాడైన ఆహార పదార్ధాలను వినియోగదారులకు వడ్డించేయడం ఏ మాత్రం చెల్లదిక్కడ..తాజాగా ధోఫర్ మున్సిపాలిటీచే 1,000 కిలోగ్రాముల ఆహారధాన్యాలు నాశనం చేసింది.  ఆ తర్వాత గవర్నరేట్ పరిధి లోని పలు దుకాణాలలో ఆకస్మికంగా పలు ఆహార పదార్ధాల తనిఖీ నిర్వహించింది. "ధోఫార్ మున్సిపాలిటీలో ఆహార నియంత్రణ శాఖ  ఇన్స్ పెక్టర్ల సమన్వయంతో పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి  మానవ వినియోగం కోసం ఏ మాత్రం పనికిరాని దాదాపు 1,236 కిలోల వివిధ ఆహార పదార్థాలు, అలాగే 3,615 లీటర్ల శీతల పానీయాలు, పాడైన పండ్ల రసాలను, కలుషితమైన  తాగునీటిని నాశనం చేశారు. ఆయా  ఉత్పత్తులకు సంబంధించిన సంస్థలకు తెలియచేసినట్లు ఆన్ లైన్ లో  విడుదల చేసిన ఒక ప్రకటనలో ధోఫర్ మున్సిపాలిటీ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com