ఎస్కలేటర్ మొరాయించడంతో సౌదీ రాజుకు తప్పని నడక
- October 07, 2017
రష్యా పర్యటనలో తన రాజవైభోగాన్ని చూపించుకోవాలని తాపత్రయ పడ్డ సౌదీ రాజు సల్మాన్ అబ్దుల్లాజిజ్ చుక్కెదురయ్యింది. మాస్కో ఎయిర్‌పోర్ట్‌కు విమానంలో వచ్చిన అబ్దుల్లా.. కిందకు దిగడం కోసం.. బంగారంతో చేయించిన ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తన దర్పాన్ని ప్రదర్శిస్తూ.. దానిపై ఎక్కి దర్జాగా కిందకు దిగబోయారు. అయితే.. సాంకేతిక లోపంతో.. అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో.. అబ్దుల్లా షాక్‌కు గురయ్యారు. చేసేదేం లేక.. మెట్లు దిగారు..
సౌదీ రాజు రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆయుధాల కొనుగోలు.. ఆయిల్ ధరల స్థిరీకరణపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించడానికి ఆయన మాస్కోకు చేరుకున్నారు. అయితే.. తనకు కావల్సిన వస్తువులన్నీ సౌదీ నుంచే ఆయన తనతో పాటు తెచ్చుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తోంది. తనతో పాటు 15 వందల మందిని వెంటేసుకొచ్చిన అబ్దుల్లా.. తాము తినడం కోసం 800 కేజీల ఆహార పదార్థాలను కూడా తెచ్చుకున్నారు. అంతేకాదు.. మాస్కోలోని ఓ లగ్జరీ హోటల్ మొత్తాన్ని కూడా బుక్ చేసుకున్నారు. అందులో కూర్చోవడానికి కావల్సిన కుర్చీలు.. కాళ్ల కింద వేసుకునే మ్యాట్లు, కార్పెట్లను సైతం సౌదీ నుంచే తీసుకొచ్చారు. హోటల్‌లో అప్పటికే ఇతరులు చేసుకున్న బుకింగ్‌లను రద్దు చేయించి, అందర్నీ ఖాళీ చేయించారు. సౌదీ రాజు తొలిసారి తమ దేశానికి వస్తుండడంతో.. సకల సదుపాయాలు కల్పిస్తామంటూ రష్యా ప్రభుత్వం చెప్పినా.. దాన్ని తిరస్కరించి అన్ని ఏర్పాట్లనూ సౌదీనే స్వయంగా చేసుకుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







