మరో ముప్పు ఎదురొకోబోతున్న అమెరికా,తరుముకొస్తున్న నేట్ హరికేన్
- October 07, 2017
హార్వే, ఇర్మా, మారియా హరికేన్ల దెబ్బ నుంచి కోలుకోకముందే అమెరికాకు మరో ముప్పు ముంచుకొస్తోంది. మధ్య అమెరికాలో బీభత్సం సృష్టించిన నేట్ తుఫాన్.. గల్ఫ్ తీరం వైపు దూసుకెళ్తోంది.
ఆదివారం నాటికి అది హరికేన్‌గా బలపడి లూసియానాలోని న్యూఓర్లేన్స్ దగ్గర తీరం దాటే అవకాశమున్నట్లు నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో 38 నుంచి 50 సెం.మీ. మేర కుండపోత వర్షాలు కురుస్తాయని, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
నేట్ తుఫాన్ హరికేన్ గా మారనున్న నేపథ్యంలో లూసియానా స్టేట్‌లో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.
నేట్ తుఫాన్ కారణంగా గల్ఫ్ తీరంలోని 15 చమురు బావుల్లో ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అంతకుముందు సెంట్రల్ అమెరికాలో నేట్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చాలా నగరాలు అంధకారంలోనే ఉన్నాయి.
నేట్ ధాటికి నికరాగ్వాలో 15 మంది, కోస్టారికాలో ఏడుగురు మరణించగా, మరో 15 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. 7 వేల మందికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







