జూపార్క్‌లో కేర్ టేకర్ ప్రాణం తీసిన తెల్ల పులులు
- October 08, 2017
బెంగళూరు బన్నేర్‌గట్ట జూపార్క్‌లో కేర్ టేకర్ ప్రాణం తీశాయి రెండు తెల్ల పులులు. నిన్న సాయంత్రం వాటికి ఆహారం పెట్టడానికి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఆంజనేయపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడి జరుగుతున్న విషయాన్ని సిబ్బంది ఎవరూ గుర్తించలేదు. దీంతో.. అతడిని కాపాడలేకపోయారు. పులుల దాడిలో ఆంజనేయకు తీవ్ర గాయాలు కావడంతో.. టైగర్ ఎన్‌క్లోజర్‌లోనే ప్రాణం వదిలాడు.
ఆంజనేయ మృతితో.. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు జూపార్క్ దగ్గర ఇవాళ ఉదయం ఆందోళనకు దిగారు. అయితే.. విషయం తెలుసుకున్న అధికారులు మాత్రం... మొహం చాటేశారు. ఒక్కరు కూడా జూపార్క్ దగ్గరకు వచ్చి.. ఆంజనేయ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. స్థానిక నేతలు కొంతమంది.. ఆంజనేయ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అధికారులు మాత్రం ఈ దాడి ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నామంటున్నారు. జూ పార్క్‌లో మరోసారి ఇలాంటి దాడి జరగకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







