‘గల్ఫ్’ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది
- October 08, 2017
పుట్టిన ఊర్లో సరైన ఉపాధి లేక ఎందరో గల్ఫ్ బాట పడుతున్నారు. తీరా అక్కడ వారు ఎదుర్కొంటున్న కష్టాలేంటి? అనే కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గల్ఫ్’. ‘సరిహద్దులు దాటిన ప్రేమకథ’ అన్నది ఉపశీర్షిక. చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.
దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వలస భారతీయులు జైలుశిక్షను అనుభవిస్తూ ఎలా హింసకు గురవుతున్నారు? అనే అంశాలను 400మందికి పైగా గల్ఫ్ బాధితులతో మాట్లాడి తెలుసుకుని ఈ చిత్రం తీశాం. గల్ఫ్ వెతలు కళ్లకు కట్టినట్టు చూపించాం. 90 శాతం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ అరబిక్ సాంగ్ కూడా ఉంది.’’ అన్నారు. చేతన్, డింపుల్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







