షార్జా రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

- October 08, 2017 , by Maagulf
షార్జా రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

షార్జాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది జీసీసీ జాతీయులు గాయాలపాలయ్యారు. వేగంగా వెళుతున్న రెండు కార్లు ఢీ కొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్జాలోని షౌకా అల్‌ దైద్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే అంబులెన్స్‌, పెట్రోల్స్‌, ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ టీమ్‌ సంఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడ్డవారిని అల్‌ దైద్‌ హాస్పిటల్‌కి తరలించారు. మృతుడ్ని మార్గ్యుకి తరలించడం జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com