మొహమాటంతో మొబైల్ ఇస్తే ... కేసులో ఇరికించిన సహోద్యోగి

- October 09, 2017 , by Maagulf
మొహమాటంతో మొబైల్ ఇస్తే ... కేసులో ఇరికించిన సహోద్యోగి

అబుదాబి : ' నిజం నిలకడ మీద తెలుస్తుంది...కానీ అబద్ధం అర్జంటుగా అపాయంలోనికి నెట్టి వేస్తుంది  ' కొందరు విపరీతమైన మొహమాటంతో తోటివారు ఏది అడిగితే అది ఇచ్చి ఆ తర్వాత ఎంతగా చిక్కులలో పడతారో తెలియచెప్పే వార్త ఇది.. మహిళా సహోద్యోగి పైన కక్ష తీర్చుకోవాలంటే మరో తోటి ఉద్యోగి సెల్ ఫోన్ తీసుకొని అసభ్యకర సందేశాలు పంపించాడో దుర్మార్గుడు...ఫోన్ ఇచ్చిన పాపానికి కేసులో ఇరుక్కున్నాడు ఆ అమాయక చక్రవర్తి ..కానీ ప్రతి కేసుని సంపూర్ణంగా శోధించి...ఒకటికి పదిసార్లు పరిశోధన చేసే అబుదాబీ పోలీసులు అసలు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకొని జైలుకి పంపారు. యూఏఈలోని అబుదాబి నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తనతోపాటే ఆఫీస్‌లో పనిచేస్తున్న ఓ మహిళను ఓ వ్యక్తి వేధించాడు. తనమీద ఎవరికీ అనుమానం రాకుండా తన పక్కనే ఉన్న వ్యక్తి సెల్‌ఫోన్ తీసుకుని ఉద్యోగినికి అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. ఆగ్రహం చెందిన బాధిత మహిళ.. అసలు నిందితుడిని వదిలి సెల్‌ఫోన్ గల వ్యక్తిని అనుమానించింది. అమాయక వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నేరానికి పాల్పడిని అసలు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా పక్క వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చేరు . దీంతో అమాయక వ్యక్తిపై కేసును కొట్టివేసిన పోలీసులు అసలు  నిందితుడిపై నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి దాదాపు 8 లక్షల 80 వేల రూపాయల జరిమానా, జైలు శిక్ష విధించిందని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com