మొహమాటంతో మొబైల్ ఇస్తే ... కేసులో ఇరికించిన సహోద్యోగి
- October 09, 2017
అబుదాబి : ' నిజం నిలకడ మీద తెలుస్తుంది...కానీ అబద్ధం అర్జంటుగా అపాయంలోనికి నెట్టి వేస్తుంది ' కొందరు విపరీతమైన మొహమాటంతో తోటివారు ఏది అడిగితే అది ఇచ్చి ఆ తర్వాత ఎంతగా చిక్కులలో పడతారో తెలియచెప్పే వార్త ఇది.. మహిళా సహోద్యోగి పైన కక్ష తీర్చుకోవాలంటే మరో తోటి ఉద్యోగి సెల్ ఫోన్ తీసుకొని అసభ్యకర సందేశాలు పంపించాడో దుర్మార్గుడు...ఫోన్ ఇచ్చిన పాపానికి కేసులో ఇరుక్కున్నాడు ఆ అమాయక చక్రవర్తి ..కానీ ప్రతి కేసుని సంపూర్ణంగా శోధించి...ఒకటికి పదిసార్లు పరిశోధన చేసే అబుదాబీ పోలీసులు అసలు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకొని జైలుకి పంపారు. యూఏఈలోని అబుదాబి నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తనతోపాటే ఆఫీస్లో పనిచేస్తున్న ఓ మహిళను ఓ వ్యక్తి వేధించాడు. తనమీద ఎవరికీ అనుమానం రాకుండా తన పక్కనే ఉన్న వ్యక్తి సెల్ఫోన్ తీసుకుని ఉద్యోగినికి అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. ఆగ్రహం చెందిన బాధిత మహిళ.. అసలు నిందితుడిని వదిలి సెల్ఫోన్ గల వ్యక్తిని అనుమానించింది. అమాయక వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నేరానికి పాల్పడిని అసలు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా పక్క వ్యక్తి సెల్ఫోన్ నుంచి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చేరు . దీంతో అమాయక వ్యక్తిపై కేసును కొట్టివేసిన పోలీసులు అసలు నిందితుడిపై నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి దాదాపు 8 లక్షల 80 వేల రూపాయల జరిమానా, జైలు శిక్ష విధించిందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







