దుబాయ్‌లో సందడి చేసిన నటి భావన
- October 09, 2017
సినీ నటి భావన దుబాయ్‌లో సందడి చేశారు. జుమైరాలోని అల్ వాసల్ రోడ్డులోగల 'సెలబ్ డిజైనర్ బషీర్ న్యూ ఔట్ పోస్ట్'ని ప్రారభించేందుకు ఆమె దుబాయ్ వచ్చారు. డిజైనర్ వస్త్రధారణలో భావన మెరిసిపోయారు. ఈ సందర్భంగా భావన ఇటీవల తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలపై పెదవి విప్పారు. మహిళలపై వేధింపులు సర్వసాధారణమైపోయాయనీ, తనకూ అలాంటి ఘటనే ఎదురయ్యిందనీ, అంతమాత్రాన సినీ పరిశ్రమని తప్పుపట్టకూడదని చెప్పిన భావన, కొందరు వ్యక్తుల వల్ల యావత్ సినీ పరిశ్రమపై చెడు భావన రావడం బాధాకరమని అన్నారు. తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన ఘటన తాను ఎదుర్కొన్నట్లు భావన చెప్పారు. భావనని కిడ్నాప్ చేసి, ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆమె మీద కక్షతోనే సినీ ప్రముఖుడు దిలీప్ కొందరితో ఈ పని చేయించాడు. సినీ పరిశ్రమలోకి ప్రముఖులు తమ వారసుల్ని తీసుకొస్తున్నారంటే, సినీ పరిశ్రమపై ఎంత ప్యాషన్‌తో ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చని చెబుతున్న భావన, 'ఆ ఘటన' తర్వాత తనకు ప్రతి ఒక్కరూ సాయంగా నిలిచారని వివరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







