మగవారిని ఎక్కడెక్కడో తాకుతున్న బ్రిటీష్ పర్యాటక తాగుబోతు..!
- October 09, 2017
దుబాయ్: ' అసలే ..తేడా ..ఆపై పీకలదాకా మద్యం సేవించాడు.. కైపు ఎక్కిన స్థితిలో కామంతో కన్ను మిన్నూ కానరాక తోటి మగాళ్లని లక్ష్యంగా చేసుకొన్నాడు ' వెనుక నుంచొని ఎక్కడెక్కడో చేతులతో బలంగా చరుస్తుండటంతో చిరాకు పడిన ఓ దుబాయ్ వ్యక్తి అసభ్య ఆంగ్లేయుడిపై కేసు పెట్టాడు. రద్దీగా ఉన్న బార్లో చేసిన వెకిలిచేష్టలపై బ్రిటీష్ పర్యాతాకునిపై కేసు నమోదైంది. ఈ కేసులో లైంగిక వేధింపుల నేరంపై ఆ వ్యక్తికి కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాప్ లో పలు అభియోగాలు మోపారు. 27 ఏళ్ల వయస్సు ఉన్న ఆ బ్రిటిష్ వ్యక్తి తనపై నమోదైన ఈ ఆరోపణ అబద్ధమని గట్టిగా ఖండించాడు, తప్పు జరిగింది కానీ, ఆ విధంగా కాదని ఖండిస్తున్నాడు. బార్ లో తానూ సేవిస్తున్న మద్యంను సమతుల్యం (బాలన్స్) చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నానని పొరబాటున తనపై ఆరోపించిన వ్యక్తిని తాకినట్లు పేర్కొంటున్నారు. జర్మన్ పాస్పోర్ట్ కల్గిన 47 ఏళ్ల అరబ్ మేనేజర్ ఈ కేసులో ఫిర్యాదుదారుడు. అల్ బర్సాలోని ఒక హోటల్లో ఉన్న ఈ బ్రిటిష్ వ్యక్తి అతని స్నేహితులలో ఒకడిగా ఉంది ఉద్దేశపూర్వకంగా తన వెనుక నడుం భాగంలో బలంగా దెబ్బ కొట్టాడని తానూ విస్తుపోయి..వెనక్కు తిరిగి ఎందుకు ఇలా చేస్తున్నావని బ్రిటిష్ వ్యక్తిని అడిగినప్పుడు అతడు నా వంక అదోరకంగా చూసి వెకిలిగా నవ్వి కన్ను గీటుతున్నదని పోలీసులకు పిర్యాదు చేశాడు. ఇదే బ్రిటిష్ వ్యక్తిపై మరొక 51 ఏళ్ల జోర్డానీ వ్యాపారవేత్త సైతం మరో ఆరోపణలు చేశాడు. తన వెనుక నుంచొని అసభ్యకరమైన ప్రదేశంలో వేలుతో బలంగా పొడిచాడని గగ్గోలు పెట్టాడు. "నా మిత్రుడు తనను నివారించాడని బ్రిటిష్ వ్యక్తి త్రాగి ఉన్నాడని మేము సరిపెట్టుకొన్నాం ." ఒక బ్రిటీష్ మెకానిక్, "క్షమించండి" అని కూడా తమతో అన్నాడని తెలిపారు. పోలీసుల ద్వారా అరెస్ట్ కాబడిన నిందితుడు ఐదు రోజులు జైలులో నిర్బంధించబడ్డాడు మరియు కేసు విచారణ పెండింగ్ లో ఉన్నందున బెయిల్ పై ఇటీవల ఆ ఆంగ్లేయుడిని విడుదల చేశారు. అక్టోబర్ 22 వ తేదీన బ్రిటిష్ వ్యక్తిపై కోర్టు తీర్పును ప్రకటించనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







