హైదరాబాద్ చైతన్య స్కూల్ లో దారుణం

- October 09, 2017 , by Maagulf
హైదరాబాద్ చైతన్య స్కూల్ లో దారుణం

హైదరాబాద్ లో కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజుల కోసం విద్యార్ధులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. చీకటి గదుల్లో బంధించి.. భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎల్బీనగర్ లోని శ్రీ చైతన్య స్కూల్లో 10వతరగతి చదువున్న విద్యార్ధులను.. పాఠశాల యాజమాన్యం గదిలో నిర్బందించింది. స్కూల్ ఫీజు కట్టే వరకు పరీక్షలు రాయనిచ్చేది లేదంటూ.. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గదిలో బంధించింది. 
పాఠశాల యాజమాన్యం పెట్టే హింసను.. విద్యార్ధులు తల్లిదండ్రులకు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులకు యాజమాన్యం నుంచి అహంకార పూరిత సమాధానం ఎదురైంది. గతేడాదికి సంబంధించి ఎటువంటి బకాయి లేకున్నా.. ఉన్నాయని చూపి.. ఫీజుల కోసం ఇబ్బంది పెడుతున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 
విద్యార్ధుల తల్లిదండ్రులు, ఏబీబీవీ కార్యకర్తలతో కలిసి శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడతామని ఎంఈవో వెంకటయ్య తెలిపారు. మేనేజ్ మెంట్ వివరణ తీసుకున్న తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ధనార్జనే ధ్యేయంగా విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్ధి సంఘ నేతలు డిమాండ్ చేశారు. నిబంధనలు కఠిన తరం చేయడంతో పాటు.. అవి పక్కాగా అమలయ్యేలా చూడాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com