టెక్సాస్ టెక్ యూనివర్శిటీలో పోలీస్ హతం.!
- October 09, 2017
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెక్సాస్ టెక్ యూనివర్శిటీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి మృతిచెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యూనివర్శిటీ క్యాంపస్‌లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సయమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతడిని స్టేషన్‌ను తరలిస్తుండగా.. దుండగుడు తుపాకీ బయటకు తీసి పోలీస్ అధికారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ అధికారి అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పుల అనంతరం దుండగుడు పారిపోయాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటన నేపథ్యంలో యూనివర్శిటీని మూసివేశారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. దుండగుడి వివరాలు తెలియరాలేదు.
ఇటీవలే లాస్‌వేగాస్‌లో ఓ దుండగుడు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. సంగీత కచేరీ జరుగుతుండగా వరుస కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా?... అందుకు సరైన వేదిక'ప్రజాశక్తి పెళ్లిపుస్తకం'. వెంటనే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







