ఈ రోజు రాజమౌళి బర్త్ డే
- October 10, 2017
ఇరవైయేళ్ల క్రితం..శాంతి నివాసం అనే టివి సీరియల్ తో ఆకట్టుకున్నాడో కుర్రాడు. తర్వాత రాఘవేంద్రరావు పర్యవేక్షణతో ఒక విద్యార్థిగా.. మరో విద్యార్థి కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆ కథ.. అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆకథ చెప్పిన దర్శకుడు.. అలా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఆ కుర్రాడు. అటుపై బ్లాక్ బస్టర్స్ కే బోర్ కొట్టేలా తెలుగు సినిమాఖ్యాతినిను ఎవరెస్ట్ ఎక్కించాడు. ఇంతింతై బాహుబలి అంతైన ఆ దర్శకుడు ఎవరో కాదు మన రాజమౌళి. కమర్షియల్ బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలకు రాజముద్ర వేసిన రాజమౌళి బర్త్ డే ఇవాళ.
బాహుబలి ద కంక్లూషన్ తో కలిపి రాజమౌళి తీసింది 11 సినిమాలు. కానీ ఆ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది.. కేవలం 11 సినిమాలతోనే అతను ఈ స్థాయికి రావడానికి కారణాలేంటీ..? 11 సినిమాలే చేసినా.. ప్రపంచమంతా అబ్బురపడిపోయే సినిమా ఎలా తీయగలిగాడు.. అంటే అదే రాజమౌళి అంటారెవరైనా.. నిజానికి బాహుబలి వరకూ రావడం వెనక అతని జర్నీ చూస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తాయి.. వైఫల్యం ఎరుగని ఆ ప్రయాణం వెనక విఫలమైన ప్రయోగాలూ, పాఠాలూ కనిపిస్తాయి.
రాజమౌళి ఇప్పుడు బాహుబలి చేయడానికి కారణమైన సినిమా ఏంటో తెలుసా.. ఛత్రపతి.. ఛత్రపతికీ బాహుబలికీ సంబంధమేంటీ అనుకుంటున్నారా..? ఉంది.. పెద్ద సంబంధమే ఉంది. తీసిన మూడు సినిమాలతోనే టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన రాజమౌళిని మరో మెట్టు పైన చూపించిన ఛత్రపతి.. ఒక్క విషయంలో మాత్రం చాలా మెట్లు తక్కువగా చూపించింది.. ఆ సీనే అతనిలో కసి నింపింది.. ఆ సీనే.. రాజమౌళిలోని ఫైర్ ను బాహుబలి వరకూ తెచ్చింది.. అంటే ఆ సీన్ రాజమౌళిని ఇబ్బంది పెట్టినట్టే కదా..ఛత్రపతిలో చిన్న సీన్ తో మొదలైన ఆలోచన ఇప్పుడు వేల మెదళ్లను కదిలించింది. కోట్లమంది ప్రేక్షకుల్ని రంజింపచేస్తోంది.. ఇప్పటి వరకూ రాజమౌళి ముద్ర తెలుగు సినిమాకే పరిమితం.. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాకూ అది రాజముద్ర అయింది.. అందుకే అంటారు.. విజన్ ఉన్నవాడికి విజ్డమ్ తోడైతే విశ్వమంతా దాసోహమవుతుందని.. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా తెలుగు సినిమా పునాదులపై భారతీయ సినిమా అన్న జెండా ఎగరేస్తోన్న రాజమౌళి భవిష్యత్ లో మన సినిమాను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని కోరుకుందాం.
బాహులి రాజమౌళి ఊహాశక్తికి ఇది దర్పణం. ఆ ఊహల్లో మనల్నీ నింపిన సృజనకు ఈ కలెక్షన్లు నీరాజనం. భారీ బడ్జెట్..కళ్లు చెదిరే గ్రాఫిక్స్.. నమ్మశక్యం కాని విజువల్ ఎఫెక్ట్స్ అనే మాట ఇప్పటి వరకూ హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వింటూ వస్తోన్న మనకు.. ఓ ప్రాంతీయ భాషా చిత్ర దర్శకుడు.. హాలీవుడ్ కు దీటుగా ఆవిష్కరించిన అద్భుతం బాహుబలి.. అలాంటి అద్భుతాన్ని మనకందించిన రాజమౌళికి మరోసారి బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







