నెదర్లాండ్స్‌లోని విచిత్ర నిర్మాణంతో వంతెన
- October 10, 2017
సాధారణంగా వంతెన అంటే నీళ్ల మీద వంతెన అనే అభిప్రాయం అందరికీ ఉంటుంది. కాని ఈ వంతెన ఒకింత విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈ వంతెనకు వాహనాల రాకపోకలు లేనట్లు, విడి భాగాలుగా కనిపిస్తుంది. నెదర్లాండ్స్‌లోని వెలువీమీర్ సరస్సుపై నిర్మించిన ఈ వంతెనకు ఓ ప్రత్యేకత ఉంది. పై నుంచి నీరు ప్రవహిస్తుంటే కింది నుంచి వాహనాలు వెళ్తుంటాయి. ఇందుకోసం నీటి కింది భాగంలో మూడు మీటర్ల లోతు, 25మీటర్ల పొడవు, 19 మీటర్ల పొడవుతో వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా అనువైన మార్గాన్ని నిర్మించారు. అంతేకాదు చుట్టూ నీటితో నిండి ఉన్న ఈ ప్రాంతంలో పాదచారులు ఆస్వాదించడానికి వీలుగా ఫుట్‌పాత్‌లను కూడా నిర్మించారు. చూడటానికి వింతగా ఉండడంతో పాటు మధ్యలో నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వంతెన ఎంత మనోహరంగా కన్పిస్తుంది కదూ!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







