2 నిమిషాల్లోనే ఫైర్ ఎమర్జన్సీ రెస్పాన్స్
- October 10, 2017
కేవలం రెండే నిమిషాల్లో ఫైర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ అందేలా యూఏఈలో సెంట్రలైజ్డ్ సెంటర్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా సెకెన్లలోనే ఫైర్ అలార్మ్‌ని అందుకోవడం ఈ కొత్త సెంటర్ ప్రత్యేకత. ఎమిరేట్‌లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా, సమాచారం తక్షణం 'సెంట్రలైజ్డ్ సెంటర్'కి చేరేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, ఇంజాజాత్ డేటా సిస్టమ్స్ సంయుక్తంగా 'హసన్‌టక్' ప్రాజెక్ట్‌ని ప్రారంభించాయి. స్మార్ట్ మానిటరింగ్, వార్నింగ్ మరియు కంట్రోల్ ఆఫ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. సివిల్ డిఫెన్స్ జనరల్ కమాండర్ జసీమ్ అల్ మర్జౌకి మాట్లాడుతూ, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌గా దీన్ని అభివృద్ధి చేశామనీ, యూఏఈ విజన్ 2021లో భాగంగా ఈ నూతన విధానాన్ని పరిచయం చేయబోతున్నామని వివరించారు. సెంట్రలైజ్డ్ సెంటర్ మొత్తంగా 150,000 పైగా భవనాలతో కనెక్ట్ అయి ఉంటుంది. హసన్‌టక్‌తో తొలి భవనం వచ్చే ఏడాది తొలి క్వార్టర్ నాటికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న 13 నిమిషాల సమయాన్ని, కేవలం 2 నిమిషాలకే పరిమితం చేసేలా ఎమర్జన్సీ రెస్పాన్స్‌కి కొత్త అర్థం చెప్పనుంది కొత్త విధానం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







