మహారాష్ట్ర ప్రభుత్వం లోకల్ ట్రైన్, ఒక్క రూపాయి క్లినిక్‌లో మహిళకు డెలివరి
- October 10, 2017
మహారాష్ట్ర ప్రభుత్వం లోకల్ ట్రైన్, మెట్రో రైల్వే స్టేషన్లలో ఒక్క రూపాయికే వైద్య సదుపాయలు అందించాలని క్లినిక్‌లను ప్రారంభించింది. రైలు స్టేషన్ వద్దకు చేరుకోగానే వైద్యులు రైల్లోకి వెళ్లి వైద్యం అందించడం వలన ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ క్లినిక్‌ను ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే అనూహ్య స్పందన వచ్చింది. గత రాత్రి దాదర్ స్టేషన్లో ఓ మహిళ పండండి బిడ్డకు జన్మనిచ్చింది. లోకల్ ట్రైన్లో వెళ్తున్న 26 ఏళ్ల సల్మా షేక్ 9 మాసాల గర్భిణీ. ఆమెకు ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన రైల్వే డాక్టర్ ప్రజ్వలిత్, తోటి ప్రయాణీకుల సాయంతో ఆమెకు కాన్పు చేశారు. డెలివరీ చేసిన వెంటనే తల్లీ బిడ్డలిద్దరినీ ఓ అంబులెన్స్ సాయంతో కేఈఎం ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆర్టీసీ బస్టాండ్లలో కూడా వన్ రూపీ క్లినిక్‌లను ఓపెన్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







