ఎనిమిదిమంది భారతీయులను కోటీశ్వరులను చేసిన ' బిగ్ టికెట్ డ్రా '
- October 10, 2017
దుబాయ్: ' అదృష్టం ఉంటె ...అబుదాబి లో ఉన్నా లాటరీ రూపంలో అమాంతంగా హత్తుకొంటుంది....ఒకరా ఇద్దరా ఏకంగా 8 మంది ఒకేసారి కోటీశ్వరులైపోయారు ' ‘బిగ్ టికెట్ లక్కీ డ్రా’లో భారతీయుల దశ తిరిగింది . ఈ బంపర్ డ్రా లో 10 మంది విజేతలల్లో 8 మంది భారతీయులే ఉండడటం విశేషం. వీరంతా భారీ మొత్తం గెల్చుకున్నారు. ఒక్కొక్కరు రూ. కోటి 70 లక్షల (2.7లక్షల డాలర్లు) నగదు బహుమతి గెల్చుకున్నారు. విజేతల్లో ఒక కెనడా , పిలిప్పీన్ దేశస్థులు కాగా మిగతా వారంతా భారతీయులే కాగా వీరిలో ఓ మహిళా సైతం ఉంది. యూఏఈ రాజధానిలో ప్రతినెలా లగ్జరీ కార్ల, ప్రైజ్‌మనీ లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇటీవల అబుదాబి అంతర్జాతీయ విమాన కేంద్రంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారతీయులకు ఈ అదృష్టం వరించింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అందడంతో విజేతలు ఒక్కసారిగా విభ్రాంతికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేవు .‘ప్రస్తుతానికి నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. చాలా ఉత్కంఠగా ఉంది. డబ్బులు ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తున్నా’ అని చంద్రేశ్ మోతివారస్ అనే విజేత తెలిపారు. తనకు తొలిసారి ఫోన్ వచ్చినప్పుడు నమ్మలేదని, తనను ఆట పట్టించడానికే స్నేహితులు ఎవరో ఇలా చేస్తారనుకున్నానని, రెండోసారి నిర్వహకులు ఫోన్ చేసినపుడు షాక్ గురయ్యానని అభయ కుమార్ క్రిష్ణన్ అనే మరో విజేత పేర్కొన్నారు. ‘ఈ డబ్బును నేను నా స్నేహితునితో పంచుకుంటా. మేమిద్దరం కలిసే ఈ టికెట్ కొన్నాం. కొంత డబ్బు కేరళలోని స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చేస్తామ’ని మరో విజేత పేర్కొన్నాడు.. గత పది ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నా. కానీ ఈ లక్కీ డ్రా తీసే రోజు మాత్రం తనకు గుర్తులేదని ఇంకొక విజేత తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







