యూపీలో మరో ఘోరం
- October 10, 2017
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని షమ్లీలో స్థానిక సరస్వతి శిశు మందిర్ పాఠశాలలోని 300మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన రసాయనాలే చిన్నారుల అస్వస్థతకు కారణంగా తెలుస్తోంది.
మంగళవారం పాఠశాల ఓపెన్ చేసే సమయంలో ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థాలను తగలబెట్టడంతో రసాయనాలు వెలువడినట్లు తెలుస్తోంది. ఆ రసాయనాల వల్లే కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోగా.. మరికొందరు శ్వాస సమస్యలతో ఇబ్బంది పడ్డారు.
కడుపునొప్పి, వాంతులు, కళ్ల మంటతో బాధపడుతున్న చిన్నారులను మీరట్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 300మంది చిన్నారుల్లో 30-35మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 15మంది చిన్నారులను మెరుగైన వైద్యం నిమిత్తం మీరట్ ఆసుపత్రికి తరలించాలని సూచించినట్లు చెప్పారు.
చిన్నారుల అస్వస్థతతో వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ పిల్లల జీవితాలకు షుగర్ ఫ్యాక్టరీ ముప్పుగా మారిందని ఆందోళనకు దిగారు. సంఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన షుగర్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







