'ఎన్నెన్నో అందాలు' అంటున్న అర్జున్ రెడ్డి

- October 10, 2017 , by Maagulf
'ఎన్నెన్నో అందాలు' అంటున్న అర్జున్ రెడ్డి

కొన్ని కాంబినేషన్స్ పవర్ ఫుల్ గా ఉంటాయి. మరికొన్ని కాంబోస్ ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఈ రెండింటి మిక్సింగ్ తో కాంబినేషన్ తోనే బాక్సాఫీస్ ను లవ్ లో పడేసే సినిమాలు చాలా రేర్ గా వస్తుంటాయి. అలాంటి కాంబోలోనే విజయ్ దేవరకొండ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చెయ్యబోతున్నాడు. 
అర్జున్ రెడ్డితో యూత్ కు ఫుల్లుగా ఎక్కేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడో రొమాంటిక్ ఎంటర్టైనర్ స్టార్ట్ చెయ్యబోతున్నాడు. పెళ్లిచూపులుతో మంచి హిట్ కొట్టి ఆడియన్స్ కు దగ్గరైన విజయ్ అర్జున్ రెడ్డితో ఓ అడిక్షన్ లా మారిపోయాడు. లోకల్ మార్కెట్ నుంచి ఓవర్సీస్ వరకు ప్రతీ మార్కెట్ లో ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రెబల్ గా దూసుకెళ్తోన్న ఈ యూత్ స్టార్ ఇప్పుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు.
 ప్రస్తుతం విజయ్ గీతాఆర్ట్స్-2లో పరశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. రష్మికా మందన ఈసినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే డిసెంబర్ లో భరత్ కమ్మ అనే డెబ్యూటెంట్ తో ఓ సినిమాను సెట్స్ కు తీసుకెళ్తేందుకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ కాకముందే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చెయ్యబోయే సినిమాను సెట్స్ కు తీసుకెళ్లడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.
కె.ఎస్.రామారావు నిర్మాణంలో క్రాంతి మాధవ్, విజయ్ దేవరకొండల సినిమా తెరకెక్కబోతోంది. 2018 ఫిబ్రవరిలో ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందట. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోలేని రొమాంటిక్ స్టోరీని డైరెక్ట్ చేసిన క్రాంతి, విజయ్ తోనూ రొమాంటిక్ స్టోరీనే తెరకెక్కిస్తాడట. ఈసినిమాకు ఎన్నెన్నో అందాలు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com