మంత్రి తలసాని కి తప్పిన కారు ప్రమాదం

- October 11, 2017 , by Maagulf
మంత్రి తలసాని కి తప్పిన కారు ప్రమాదం

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పెద్దప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు కీసర సమీపంలో ప్రమాదానికి గురైంది. శామీర్‌పేట్‌ నుంచి కీసరకు వెళ్తుండగా ఔటర్‌ రింగ్‌రోడ్డుపై మంత్రి వాహనాన్ని ఓ లారీ ఢీకొంది.
ఈ ఘటనలో తలసాని వాహనంలోవున్న మేడ్చల్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. మేడ్చల్ కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేసి కీసర వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనాస్థలికి పోలీసులు, అధికారులు చేరుకొని పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com