వైరల్ గా మారిన ఫోటో...ఒప్పుకోని వర్మ
- October 11, 2017
వర్మ టేకప్ చేసిన 'లక్ష్మీస్ ఎన్టీయార్' మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చీరాగానే.. దాంతోపాటే రూమర్లు, సెటైర్లు బోలెడన్ని! 'లక్ష్మీస్ ఎన్టీయార్'లో లక్ష్మి ఎవరు? ఎన్టీయార్ ఎవరు అంటూ ఎవరికీ వారు లెక్కలేసుకోవడం కనిపిస్తోంది. కానీ.. రోజాకు ఓ మంచి రోల్ ఉంటుందని వర్మ స్వయంగా చెప్పేశారు. మంచి రోల్ అంటే.. ఎన్టీయార్ బయోగ్రఫీలో లక్ష్మి పార్వతి కంటే మించింది లేదు.
ఎక్కువ ఫ్రేమ్స్ లో కనిపించదగ్గ ఫిమేల్ పర్సనాలిటీ ఈ సినిమాలో వెతికినా కనిపించదు. అందుకే.. లక్ష్మిపార్వతిగా రోజా.. అంటూ నెటిజన్లు ఫిక్సయిపోయారు. ఇటు.. ఎన్టీయార్ పాత్రను ప్రకాష్ రాజ్ అయితే బాగా చేస్తారంటూ సజెషన్లు కూడా వచ్చేశాయి. ఇప్పటికే తమిళనాడు పాలిటిక్స్ మీద మణిరత్నం తీసిన 'ఇద్దరు' మూవీలో కరుణానిధి పాత్రలో కనిపించి మెప్పించారు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో ఎన్టీయార్ వేషమేస్తే ప్రకాష్ రాజ్ అతికినట్లు సరిపోతారంటూ కాంప్లిమెంట్స్ పడిపోతున్నాయి. సో.. 'రోజాస్ ప్రకాష్ రాజ్'..!
అంటూ ఒక కుక్డ్ ఫోటో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ.. ఈ కాంబోను వర్మ వర్కవుట్ చేస్తారా?
ఇప్పటికైతే.. అటువంటి ఆలోచనేదీ లేదని ఆయన క్లారిటీనిచ్చేశారు.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







