త్వరలో మహేష్ తో 'ఛత్రపతి శివాజి' SS రాజమౌళి చిత్రం
- October 11, 2017
సూపర్ స్టార్ మహేష్ ఛత్రపతి శివాజి సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. అబ్బో ఈ ఆలోచన అదిరిపోతుంది కదా. సీనియర్ ఎన్.టి.ఆర్, సూపర్ స్టార్ కృష్ణ శివాజి చరిత్రతో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. వారు చేయకున్నా శివాజి కథ మహేష్ తో చేస్తే అదిరిపోద్దని అంటున్నాడు పరుచూరి సోదరులలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ.
ఈమధ్యనే పరుచూరి పలుకులు అంటూ ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించిన ఆయన సినిమా పరిశ్రమలో క్రేజీ కాంబినేషన్స్ మీద మాట్లాడుతున్నారు. ఇక మహేష్ హీరోగా శివాజిగా చూపించే సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్.టి.ఆర్, కృష్ణ చేయలేని ఆ ప్రాజెక్ట్ మహేష్ చేస్తే బాగుంటుందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
ఇక ఎన్నాళ్లనుండో మహేష్ తో రాజమౌళి సినిమా ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కె.ఎల్.నారాయణ ఈ ఇద్దరి కాంబోకి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నాడట. మరి రాజమౌళి కాస్త టైం తీసుకుని అయినా సరే పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్టుగా ఛత్రపతి శివాజి మహేష్ తో చేస్తాడేమో చూడాలి.
ప్రస్తుతం మహేష్ భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లితో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రాజమౌళి సినిమానే ఉంటుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమన్నది చూడాలి. మొత్తానికి ఛత్రపతి శివాజిగా మహేష్ చేస్తే కనుక ఇక ఆ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







