పాపం జుహీ చావ్లా
- October 11, 2017
జనరల్ నాలెడ్జ్ విషయంలో బాలీవుడ్ యువ తార అలియా భట్ ఎంత అభాసుపాలైన సంగతి తెలిసిందే. మన దేశ ప్రధాని ఎవరు అనే ప్రశ్నకు ప్రతిభా పాటిల్ అని చెప్పి అప్పట్లో చాలా సెటైర్లు ఎదురుకుంది అలియా.ఇప్పుడు జుహీ చావ్లా కూడా ఇలానే బుక్ అయ్యింది.
వివరల్ల్కి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియిన్ పరిధిలో బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంపై చావ్లా స్పందించింది. కోర్టు తీర్పును హర్షిస్తు.. ''ఢిల్లీ సుప్రీం కోర్టు బహ్మాండమైన తీర్పు ఇచ్చింది. నవంబరు 1వ తేదీ వరకు బాణసంచాపై నిషేధం ఉండాల్సిందే. ఈ దీపావళిని ప్రేమ, ఆప్యాయతలతో జరుపుకోండి'' అని ట్వీట్ చేసింది.
అయితే ట్వీట్ లో చిన్న పొరపాటు వుంది. ఢిల్లీ సుప్రీంకోర్టు అని రాసింది జుహీ. దీంతో ఢిల్లీకి ఎప్పుడు సుప్రీం కోర్టు ఏర్పాటు చేశారు అంటూ సెటర్ల పై సెటర్లు వేస్తున్నారు నెటిజన్స్.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







