ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండియా 70 క్విజ్
- October 11, 2017
మస్కట్: మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ, స్వతంత్ర భారతావని 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న దరిమిలా, ఇండియా 70 పేరుతో క్విజ్ పోటీల్ని నిర్వహించింది 200 మంది పార్టిసిపెంట్లను 44 టీమ్‌లుగా విభజించి, ఈ పోటీలు నిర్వహించారు. ఒక్కో టీమ్ నుంచి ముగ్గురు పార్టిసిపెంట్లకు అవకాశం లభించింది. స్వాతంత్య్ర పోరాటం, కాంటెంపరరీ హిస్టరీ, గడచిన 70 ఏళ్ళలో భారతదేశం సాధించిన ప్రగతి వంటి విషయాలపై క్విజ్‌లో ప్రశ్నలు పొందుపర్చారు. ప్రముఖ పోయెట్, పెయింటర్ సుష్మితా గుప్తా ఈ క్విజ్‌ని నిర్వహించారు. రాయల్ బెంగాల్ క్విజర్ ఈ క్విజ్‌లో విజయం సాధించింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావని ఘన చరిత్రను గుర్తు చేసుకునేందుకు, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన అనేక విషయాల్ని నేటి తరానికి తెలియజేసేందుకు భారత ప్రభుత్వ సూచనలతో ఇండియన్ ఎంబసీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఆగస్ట్ సెప్టెంబర్లలో మస్కట్, నిజ్వా, సలాలా, సుహార్, సుర్ వంటి చోట్ల కథక్ డాన్స్ ట్రూప్, రాజస్తానీ ఫోక్ డాన్స్ ట్రూప్, సెమీ క్లాసికల్ కర్నాటిక మ్యూజిక్ గ్రూప్, న్యూ ఇండియన్ మంథన్ వంటి కార్యక్రమాలు, ప్రదర్శనలు చేపట్టారు. 2018 ఆగస్ట్ వరకు ఇండియన్ ఎంబసీ ఇంకా పలు కార్యక్రమాల్ని చేపట్టనుంది. వాటిల్లో థియేటర్ ఫెస్టివల్, పెయింటింగ్ ఎగ్జిబిషన్, పెయింటింగ్ కాంపిటీషన్ వంటివి ఉంటాయి. ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ఒమన్ - ఇండియన్ ఎంబసీ చేపడ్తోన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







