ఉత్తర కొరియాపై అగ్రరాజ్యం అమెరికా యుద్ధవిమానాలు
- October 11, 2017
అగ్రరాజ్యం అమెరికా, ఉత్తరకొరియా మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అణుదాడి చేస్తామంటూ వరుస హెచ్చరికలకు దిగుతున్న ఉత్తరకొరియాకు దీటుగా బదులిచ్చేందుకు అమెరికా కూడా సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే ఉత్తరకొరియా నుంచి వచ్చే ముప్పుపై ఎలా స్పందించాలనే అంశంపై రక్షణశాఖ అధికారులతో ట్రంప్ నేడు సమావేశమయ్యారు. కాగా.. ఇదే సమయంలో కొరియన్ పెనిన్సులాపై అమెరికా యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టడం గమనార్హం.
అమెరికాకు చెందిన రెండు విమానాలతో పాటు దక్షిణకొరియా మిలిటరీకి చెందిన రెండు ఫైటర్ జెట్‌లు కొరియన్ పెనిన్సులాపై చక్కర్లు కొట్టాయి. అయితే అమెరికా, దక్షిణకొరియా సంయుక్తంగా డ్రిల్ చేపట్టిందని.. అందులో భాగంగానే యుద్ధ విమానాలు వెళ్లినట్లు దక్షిణకొరియా అధికారిక ప్రకటన వెలువరించింది. మరోవైపు అమెరికా మిలిటరీ కూడా దీనిపై స్పందించింది. జపాన్‌కు చెందిన యుద్ధవిమానాలు కూడా ఈ డ్రిల్‌లో పాల్గొన్నట్లు పేర్కొంది.
అమెరికా, జపాన్, దక్షిణకొరియా సంయుక్తంగా మిలిటరీ డ్రిల్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇటీవల అమెరికాపై ఉత్తరకొరియా వరుస హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ద్వీపంపై అణుదాడి చేస్తామని బెదిరింపులకు దిగింది. దీంతో ఉత్తరకొరియా ఆగడాలను అరికట్టేందుకు అమెరికా కూడా చర్యలు చేపట్టింది. గువామ్ బేస్ నుంచే ఈ యుద్ధవిమానాల డ్రిల్ చేపట్టింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







