బుల్లి తెర యాంకర్ మల్లిక మరణం వెనుక కారణం ఇదేనా..!!
- October 11, 2017
20 ఏళ్ల క్రితం యాంకర్ గా బుల్లి తెరపై ఆకట్టుకొన్న మల్లిక... మహేష్ బాబు తల్లిగా రాజకుమారుడు తో తొలిసారిగా వెండి తెరపై అడుగు పెట్టింది. అనంతరం అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అలరించింది.. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొన్నది. కాగా చిన్న వయసులో 39 ఏళ్లకే మల్లిక అనారోగ్యంతో సోమవారం బెంగళూరులో మృతి చెందిన విషయం విధితమే.. కాగా భర్త విజయ్ సాయి బెంగళూరులో ఉండడంతో మల్లిక ఇటీవలే బెంగళూరు వెళ్ళింది.. అక్కడ అనారోగ్యానికి గురైన మల్లిక 20 రోజులు కోమాలో ఉంది.. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు.. ఆమెను తిరిగి మామూలు మనిషిని చెయ్యడానికి డాక్టర్లు చాలా ప్రయత్నించారని... వారు తెలిపారు.. కానీ మల్లిక బ్రెయిన్ హ్యామరేజ్ కారణంగా కోమాలోకి వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.. పెళ్లి చేసుకొన్న తర్వాత నటనకు దూరమైన మల్లిక కు కృష్ణ ప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు..
బుల్లి తెరపై మంచి వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకొన్న మల్లిక అసలు పేరు.. అభినవ.. ఉత్తమ యాంకర్ గా అవార్డ్స్ అందుకొన్న మల్లిక నటిగా కూడా అంతే మంచి పేరు తెచ్చుకొన్నది.. ఎటువంటి ఎమోషనల్ సీన్స్ లో నాలుగు ఐదు పేజీల డైలాగ్స్ ను కూడా సింగిల్ టేక్ తో చేసేవారు అని తోటి నటీనటులు ఆమెతో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.. కాగా మల్లిక కు నటనలోనే కాదు.. క్రీడల్లో కూడా మంచి -ప్రవేశం ఉంది.. బాస్కెట్ బాల్ క్రీడలో జాతీ
యస్థాయి ప్లేయర్ కూడా... నటనలో, క్రీడల్లో రాణించిన మల్లిక చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందడం పట్ల.. ఆమె సన్నిహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.. సుమ తో సమకాలీన యాంకర్ గా మల్లిక రాణించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







