ఏజెంట్ మోసం ..బానిసగా బతుకుతున్న భారతీయ మహిళ

- October 11, 2017 , by Maagulf
ఏజెంట్ మోసం ..బానిసగా బతుకుతున్న భారతీయ మహిళ

సౌదీఅరేబియా: ఏజెంట్ మాయ మాటలకు పడిపోతే ఆ తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో తెలియచెప్పే వార్త ఇది.  భారతదేశంలోని  పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన  నూర్‌మహల్‌కు చెందిన సువ్కాంత్ కౌర్(55) అనే మహిళను మూడు నెలల విజిటింగ్ వీసాపై ఢీల్లికి చెందిన ఒక  ఏజెంట్ సౌదీ పంపాడు. జనవరిలో ఆమె సౌదీ వెళ్లింది. అయితే సౌదీలో ఆమెను ఆ ఏజెంట్ స్థానిక వ్యక్తికి అమ్మేశాడు.నాటి నుండి ఆమె యజామాని ఇంట్లో బానిసగా పనిచేస్తోంది. దాంతో తిరిగి భారత్ వచ్చేయాలనుకుంది. ఆమెను రోజు నానా రకాలుగా హింసించే యజమాని భారీ నుంచి ఎలాగైన తప్పించుకోవాలనుకుంది. ఆమె యజమాని లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆ బాధలు భరించలేకపోయింది. అయితే సౌదీ వెళ్లిన వారం రోజులపాటు తన భార్య రోజు ఫోన్ చేసి తనతో మాట్లాడేదని సుక్వాంత్ చెబుతున్నారు. ముందుగా తన భార్యను దుబాయ్ పంపారని అక్కడి నుంచి మళ్లీ సౌదీ తీసుకువచ్చారని అతడు అంటున్నాడు. అలా యజమాని వేధింపులతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయింది.ఆమెను సౌదీలోని హోల్ సీటీలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఒక కేరళ నర్సు సహయంతో కౌర్ తన భర్తకు జరిగిన విషయాలు చెప్పింది. దాంతో అతడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్టర్ ద్వారా ఆమె ఆవేదనను తెలియజేశాడు. అలాగే ఆ ఏజెంట్‌పై కేసు కూడా పెట్టాడు. అయితే తన భార్య పాస్‌పోర్టు అతడి దగ్గరే ఉండిపోయిందని అతడు చెప్పాడు. కానీ, ఏజెంట్ పరారీలో ఉన్నాడు. దాంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. సౌదీ వ్యక్తికి ఆ ఏజెంట్ తన భార్యను బానిసగా అప్పగించాడని సుక్వాంత్ తెలిపారు. వెంటనే తన భార్యను ఇండియా రప్పించాలని అతడు కోరుతున్నాడు. సౌదీలోని ఇండియన్ ఎంబసీకి కూడా లేఖ రాశాడు. తన భార్యకు పాస్‌పోర్టు ఇచ్చి ఇండియా పంపించాలంటున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com