హైదరాబాద్లో హై అలెర్ట్.!
- October 11, 2017
రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు అనూహ్యంగా 15 రోజులపాటు ప్రత్యేక ఆంక్షలు విధించారు. నగరంలోని థియేటర్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, దేవాలయాలు, విద్యాసంస్థలు, మద్యం షాపులు, రెస్టారెంట్లు వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రాంతాలు, జనం గుమిగూడే ప్రాంతాల్లో తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యూ పద్ధతి పాటించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు నిబంధనలు పాటించకుంటే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఇలా ప్రత్యేక ఆంక్షలు విధించారు. అయితే, దీపావళి పండుగను పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఈ నిషేధాజ్ఞలు విధించారా? లేక ఏదైనా నిఘా వర్గాల సమాచారం మేరకు ఉగ్ర ముప్పు కారణంగా ఈ ఆంక్షలు అమల్లోకి తెచ్చారా? తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







