సౌదీ మహిళా డ్రైవర్లు జరీమానా చెల్లించాల్సిందే

- October 11, 2017 , by Maagulf
సౌదీ మహిళా డ్రైవర్లు జరీమానా చెల్లించాల్సిందే

2018 జూన్‌కి ముందు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ సౌదీ మహిళా డ్రైవర్లు జరీమానా కట్టాల్సిందేనని ఓ మీడియా రిపోర్ట్‌చెబుతోంది. ఈ పెనాల్టీ ఫైన్స్‌ 133 డాలర్లు (499 సౌదీ రియాల్స్‌) మరియు 239 డాలర్లు (896 సౌదీ రియాల్స్‌) వరకు ఉంటుంది. అయితే ఆ మహిళలెవర్నీ అరెస్ట్‌ చేయలేదని ఆ రిపోర్ట్‌ వెల్లడించింది. మహిళా డ్రైవర్లపై బ్యాన్‌ ఎత్తివేయకముందు జరీమానాలు విధింపబడ్డవారికి మాత్రమే ఈ చెల్లింపు ఆదేశాలు వర్తిస్తాయట. మహిళలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాలకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ ఘటనలో 15 ఏళ్ళ బాలుడు, ఓ మహిళా డ్రైవర్‌ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం వల్ల చనిపోతే, ఇంకో ఘటనలో ఓ మహిళ చనిపోగా, ఆమె భర్త తీవ్రగాయాల పాలయ్యారు. భర్త, ఆమెకు కారు నడపడం నేర్పుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా, సౌదీ కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌అజీజ్‌ అల్‌ సౌద్‌, సెప్టెంబర్‌లో మహిళలు కార్లను నడిపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై సౌదీ అరేబియాలో నిషేధం అమల్లో ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com