వ్యాట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- October 11, 2017
యూఏఈ ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ, ఎఫ్‌టిఎ - ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యాట్ కోసం ఓపెన్ చేసినట్లు పేర్కొంది. తమ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2018 జనవరి 1 నుంచి వ్యాట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఐదు శాతంగా వ్యాట్‌ని నిర్ణయించడం జరిగింది. వ్యాట్ పరిమితుల్లోకి వచ్చే అన్ని వ్యాపార విభాగాలకూ వీలుగా ఉండేలా, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 375,000 అరబ్ ఎమిరేట్ దినార్స్ పరిమితి దాటితే ఖచ్చితంగా ఆయా వ్యాపార సంస్థలు వ్యాట్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వార్షిక టర్నోవర్ 150 మిలియన్ ఎఇడి దాటేవారికి 31 అక్టోబర్ లోగా వ్యాట్ రిజిస్ట్రేషన్ గడువు కాగా, 10 మిలియన్ ఎఇడి వార్షిక టర్నోవర్ గలవారికి 30 నవంబర్ ఆఖరి రిజిస్ట్రేషన్ తేదీగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎఫ్‌టిఎ డైరెక్టర్ జనరల్ ఖాలిద్ అల్ బుస్తాని మాట్లాడుతూ, వ్యాట్ కోసం ఆయా విభాగాల్ని ముందస్తుగా ప్రిపేర్ చేసే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాల్ని ఉధృతం చేశామని తెలిపారు. అన్ని వ్యాపార వర్గాలకూ వ్యాట్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ విభాగం రోజులో ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటుందని చెప్పారాయన.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







