ఫేక్ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌తో తస్మాత్ జాగ్రత్త
- October 12, 2017
జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అధికార ప్రతినిథి కల్నల్ తరీక్ అల్ ఆర్బీన్ మాట్లాడుతూ, డ్రైవింగ్ టీచర్లుగా అవతారమెత్తిన కొందరు అక్రమార్కులు సౌదీ మహిళల్ని వంచిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారికంగా డ్రైవింగ్ నేర్పించే కేంద్రాలను త్వరలో ప్రకటిస్తామనీ, ఈలోగా తొందరపడి అక్రమార్కుల వలలో పడవద్దని ఆయన సూచించడం జరిగింది. ఈస్టర్న్ ప్రావిన్స్‌లోని కొన్ని ఆఫీసులతోపాటు, మరికొంతమంది మహిళలకు డ్రైవింగ్ నేర్పుతామంటూ ముందుకొస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారాయన. మినిస్టీరియల్ కమిటీ సంబంధిత రెగ్యులేషన్స్ పూర్తి చేయగానే, నెలరోజుల్లోపు అధికారిక ట్రైనింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారాయన. ఎలాంటి అనుమతి లేకుండా ఎవరైనా మహిళలకు డ్రైవింగ్ ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లయితే వారికి కఠినంగా జరీమానాలు విధిస్తామని అల్ అర్బీన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







