మా అమ్మే నా హీరో, నా రోల్ మోడల్ అంటున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా
- October 12, 2017
బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రియాంక ఇన్‌స్టాగ్రాంలో తన తల్లి గురించి, ఆడపిల్లల గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఆడపిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లి కీలక పాత్ర వహిస్తుంది. ఈ రోజున నేనీ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మ. మా అమ్మ చాలా పట్టుదలగల మనిషి. చాలా తెలివైంది. తను అనుకున్నది సాధించడం కోసం ఇల్లు వదిలి వెళ్లి పోయింది. మెడిసిన్‌కు సంబంధించి ఎనిమిది సర్టిఫికెట్లు అందుకుంది. ఆర్మీలో వైద్యురాలిగా పనిచేసింది. వైద్యురాలిగానే కాకుండా ఫైలట్‌గా కూడా సర్టిఫికెట్ తెచ్చుకుంది. తొమ్మిది భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. వీటన్నింటికీ మించి ఓ గొప్ప తల్లి, కుమార్తె, సోదరి, భార్య, వ్యాపార వేత్త కూడా. నా బలం, బలహీనత కూడా మా అమ్మే. అందుకే ఆమే నా హీరో అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం మూడు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ప్రియాంక.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







