ఆంధ్రా అమితాబ్

- October 12, 2017 , by Maagulf
ఆంధ్రా అమితాబ్

బాలీవుడ్ బిగ్ బీ... అమితాబ్ అక్టోబర్ 11 న తన 75 పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు.. కాగా మన నమ్మకం.. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని... ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అనేక సార్లు మనిషిని పోలిన మనుషులు కనిపిస్తూనే ఉంటారు.. ఇక బిగ్ బీ అమితాబ్ ను పోలి ఆంధ్రా అమితాబ్ గా పేరుపొందిన గోపి(50) పేరు ముందు వరసలో ఉంటుంది. గోపి చిన్న తనం నుంచి చూసేవారికి అమితాబ్ తరహాలో కనిపిస్తాడు.. అమితాబ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'కూలీ' చూసిన తర్వాత 6 అడుగుల ఎత్తు ఉండే గోపీ ఆయన అభిమానిగా మారిపోయాడు.. అప్పటి నుంచి ఆయన్ని అనుకరించడం ప్రారంభించాడు.. గోపి కోటు ధరించి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుంటే.. అతడిని అంతా పక్కా అమితాబ్ అని  అంటారు.. అంతేకాదు కొంత మంది ఆయన ఆటోగ్రాఫ్ లు తీసుకోవడానికి ఎగబడతారు కూడా.. కానీ తాను ఎవరికీ ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ఇష్టపడడు.. ప్రస్తుతం గోపీ ప్రీలాన్స్ కెమెరా మెన్ గా పని చేస్తున్నాడు.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com