ఇతగాడి వరస బాగుందే..ఏకంగా విల్లా నే పట్టేశాడు
- October 12, 2017
షార్ట్ ఫిల్మ్ నుంచి ఎవరూ ఊహించని విధంగా ఉయ్యాల జంపాల సినిమాతో వెండి తెరపై హీరోగా అడుగు పెట్టిన రాజ్ తరుణ్... మల్టీ టాలెంటెడ్ పర్సన్. మొదటి సినిమాతో హిట్ కొట్టిన రాజ్ తరుణ్... కుమారి 21 ఎఫ్ తో యంగ్ హీరోల్లో క్రేజీ హీరోగా మారిపోయాడు. కుమారి తర్వాత సరైన సక్సెస్ లేక సతమత మవుతున్న రాజ్ తరుణ్ ఆర్ధిక ప్రణాళిక లు మాత్రం సూపర్ అంటున్నారు.. రాజ్ తరుణ్ కి ఉన్న ఆర్ధిక అవగాహన అప్పట్లో చాలామంది నటీనటులకు ఉంటే ఎంతో బాగుండేది అని కూడా సినీ విశ్లేషకుల అభిప్రాయం.. అసలు ఇప్పటి వరకూ ఏ హీరో చెయ్యని విధంగా తన రెమ్యునరేషన్ విషయం లో ప్రణాళికలు రచిస్తున్నాడు రాజ్ తరుణ్... రాజ్ తరుణ్ ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఐదు సినిమాలు చెయ్యడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంగతి విధితమే... కాగా ఈ సినిమాలను చెయ్యడం కోసం రెమ్యూనరేషన్ గా డబ్బు తో పాటు.. అనిల్ సుంకర ఉంటున్న గేటెడ్ కమ్యూనిటి లో ఒక విల్లా తీసుకొంటున్నాడు. దిల్ రాజు అల్లుడు కడుతున్న ఈ విల్లా ఖరీదు అక్షరాల ఆరున్నర కోట్లట. అంటే రెమ్యునరేషన్ తీసుకొని దానిని రియల్ ఎస్టేట్ లో పెట్టడం కంటే.. తన పారితోషకం ఇన్వెస్ట్మెంట్ గా తీసుకొంటున్న రాజ్ తరుణ్ ఆర్ధిక ప్లాన్ ఇప్పటి వరకూ ఏ హీరో అమలు చేయలేదని అంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







