యునెస్కో ను వీడిన అమెరికా...
- October 12, 2017
వాషింగ్టన్: అమెరికా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. ఈ సంస్థ అనుసరిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రదేశ అధికారులు వెల్లడించారు. 2011లో పాలస్తీనియన్ అథారిటీకి యునెస్కోలో స్థానం కల్పించినప్పటి నుంచీ ఈ సంస్థకు నిధుల పంపిణీని అమెరికా నిలిపి వేసింది. అయితే పారిస్‌లో ఉన్న యునెస్కో హెడ్‌క్వార్టర్స్‌లో మాత్రం తమ కార్యాలయాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. యునెస్కో కొత్త డైరెక్టర్ కోసం ఓటింగ్ వెళ్తున్న సమయంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొంతకాలంగా యునెస్కో తీసుకుంటున్న యాంటీ ఇజ్రాయెల్ విధానాలపై యూఎన్‌కు అమెరికా అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నిక్కీ హేలీతోపాటు పలువురు సీనియర్ అధికారులు విమర్శిస్తూనే ఉన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







