నోల్ కార్డులతో ఫుడ్, ఎటర్టైన్మెంట్ కూపన్స్
- October 12, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), ఎన్‌ఓఎల్ కార్డులకు సంబంధించి లాయల్టీ పాయింట్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించనుంది. ఎన్‌ఓఎల్ ప్లస్ ప్రోగ్రామ్, ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. ఎన్‌ఓఎల్ కార్డులకు ఈ కొత్త విధానం ద్వారా పాజిటివ్ పాయింట్స్ అందుతాయి. వీటిని కూపన్లు లేదా వోచర్లుగా మార్చుకోవచ్చు. కేఫ్‌లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్‌లో వాటిని వినియోగించడానికి వీలుంటుంది. ఆర్టిఎ కార్పొరేట్ టెక్నాలసీ సపోర్ట్ సర్వీస్ సెక్టార్- ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్స్ డైరెక్టర్ ఖాలిద్ అల్ అవధి మాట్లాడుతూ, తొలిసారిగా ఎన్‌ఓల్ కార్డుదారులకు లాయల్టీ పాయింట్స్ అందించే విధానాన్ని అమలులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్‌ఓఎల్ కార్డుల ద్వారా మెట్రో, పబ్లిక్ బస్‌లు, ట్రామ్, మెరైన్ ట్రాన్స్పోర్ట్ మీన్స్, పార్కింగ్, ఎతిహాద్ మ్యూజియం / పబ్లిక్ పార్క్‌ల విజిటింగ్ వంటివాటికి ఉపయోగిస్తే దానికి అనుగుణంగా లాయల్టీ పాయింట్లు వినియోగదారులకు చేరతాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







