యాంకర్ శ్యామలకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
- October 13, 2017
ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజుగారి గది-2 ప్రమోషన్‌లో నాగార్జున, సమంత బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ యాంకర్ శ్యామలతో ఇంటర్వ్యూని ఏర్పాటు చేసింది. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు వేస్తూనే మధ్యలో నాగార్జునను మీసం ఎందుకు తీసేశారని ప్రశ్నించింది యాంకర్. దానికి నాగార్జున ఏం బాలేదా.. చాలా మంది బావుందంటున్నారు కదా అని అనేసరికి యాంకర్.. మీరు చాలా బావున్నారు.. కానీ మన్మధుడికి మీసం ఉంటే కొంచెం రొమాంటిక్‌గా ఉంటుందని అంటూనే చైతన్య, సమంతల పెళ్లి చేశారు... వయసు కనబడనివ్వకూడదని ఏమైనా ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించింది. వెంటనే నాగార్జున.. పక్కనే కోడలుంది.. బిహేవ్ యువర్ సెల్ఫ్ అని సుతిమెత్తగా యాంకర్ శ్యామలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మధ్యలో సమంత కలగజేసుకుని అయ్యో.. నా ఫ్రెండ్స్‌లోనే నాగార్జున గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటూ సమాధానం చెప్పింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









