బహ్రెయిన్ లో కెరీర్ ఫెయిర్ ప్రారంభం
- October 13, 2017
మనామా : కార్మిక మరియు సాంఘిక అభివృద్ధి మంత్రి జమీల్ బిన్ మహ్మద్ ఆలీ హుమాడేన్ గురువారం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సాధారణ వృత్తి ప్రదర్శన ( కెరీర్ ఫెయిర్ ) ను ప్రారంభించారు.ఈ ప్రదర్శన అక్టోబరు 11-12 వ తేదీలలో బని జమ్రా కల్చరల్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ హాల్ వద్ద నిర్వహించబడింది. ఈ ఉద్యోగ ప్రదర్శనలో 1,200 కన్నా ఎక్కువ ఉద్యోగ ఖాళీలను చోపించడం జరిగింది. . ఎనిమిది వందల ఉద్యోగ ఖాళీలు 30 సంస్థల నుండి అందిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 300 బెహెరిన్ దినార్ల నుండి 1800 బెహెరిన్ దినార్ల వరకు నెలకు జీతం కల్పించనున్నారు. మంత్రిత్వ శాఖ నుండి ఎంపిక చేసిన డేటాబ్యాంకు నుండి ఎంపిక చేసిన 400 ఉద్యోగ ఖాళీలు సైతం ఉన్నాయి. అర్హతలు కలిగిన అభ్యర్థుల కోసం వివిధ అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. తాంకీన్ సహకారంతో 460 శిక్షణా అవకాశాలను మంత్రిత్వ శాఖ అందిస్తోంది. ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ జలాల్ కధీమ్ అల్ మహ్ఫౌజ్, ఎంపి హమద్ సలేం అల్ దొసేరీ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









