నా తరువాత సినిమా మహేష్ తో అంటున్న దర్శక ధీరుడు
- October 13, 2017
బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో రుచి చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి..తన నెక్స్ట్ సినిమా ఏంటి..? ఎప్పుడు చేస్తాడు..? ఏ హీరోతో చేయబోతున్నాడు..? ఎలాంటి కథ తో వస్తున్నాడని సినిమా ప్రేక్షకులే కాదు అన్ని ఇండస్ట్రీల వారు ఆసక్తిగా కొన్ని నెలలుగా ఎదుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు తెరదించాడు రాజమౌళి.
తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా గురించి తెలిపారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తో తన నెక్స్ట్ సినిమా అని అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని మీడియా కు తెలిపాడు. 'నా తర్వాతి చిత్రంలో ఎవరు నటిస్తారు, దాన్ని ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తాం అనే విషయాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. దానయ్య(నిర్మాత)తో సినిమాకు ఒప్పుకున్నా. అదే నా తర్వాతి చిత్రం' అని జక్కన్న చెప్పుకొచ్చాడు.
2019లో రాజమౌళి-మహేశ్ సినిమా సెట్స్ పైకి రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేశ్ కొరటాల శివ దర్శకత్వం లో 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







