జమ్మూ కశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రవాది అరెస్ట్

- October 13, 2017 , by Maagulf
జమ్మూ కశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రవాది అరెస్ట్

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు శుక్రవారం హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన్‌ కీలక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు శుక్రవారం ఉదయం నుంచి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ కార్డన్‌ సెర్చ్‌లో భాగంగానే ఫస్తూరా అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన గుల్జార్‌ దార్‌ అనే ఉగ్రవాదిని.. అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com