దూకుడు దేశానికి దూరంగా ఉండాలని దుబాయి సంచలన నిర్ణయం
- October 13, 2017
దుబాయి : దూకుడు దేశానికి దూరంగా ఉండాలని దుబాయ్ నిర్ణయించుకొంది. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని దెబ్బ కొట్టింది. ఉత్తర కొరియన్లకు ఇకపై వీసా సర్వీసులు అందించబోమని తేల్చిచెప్పింది. ఉత్తర కొరియాతో సంబంధాల విషయమై దుబాయి ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కొరియాకు తన రాయబారిని రద్దు చేసుకుంది. ఉత్తర కొరియా పౌరులకు వీసాలు, కంపెనీ వీసాలను ఇకపై ఇవ్వబోమని తెలిపింది. ఉత్తర కొరియా చేస్తున్న అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగానే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దుబాయి ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ భద్రతను దృష్టిలో పెట్టకుని తమ వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దుబాయ్ తెలిపింది. ఈ నిర్ణయాన్ని తాము కూడా అనుసరిస్తున్నట్లు గల్ఫ్ దేశాలయిన కువైట్, ఖతర్ సైతం తేల్చిచెప్పాయి. ఇప్పటికే యూఏఈలో దాదాపు 1300 మంది ఉత్తర కొరియన్లు జీవనోపాధి పొందుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







