డెహ్రాడూన్‌లో నల్గొండ విద్యార్థి మృతి
- October 13, 2017
నల్లగొండ జిల్లా విద్యార్థి డెహ్రాడూన్‌లో గంగోత్రి నదిలో మునిగి మృతి చెందాడు. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నరహరి అనే విద్యార్థి నదీ స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. ఈ ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా గురువారం నరహరి ఫ్రెండ్స్‌తో కలిసి ఉత్తరకాశీలోని గంగోత్రి టూర్‌కి వెళ్లాడు. దైవదర్శనానికి ముందు నదిలో స్నానం చేయడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరాడు.
నరహరి డెహ్రాడూన్‌లోని DSB యూనివర్సిటీలో అగ్రికల్చర్ BSC ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మిత్రులతో కలిసి గంగోత్రి నదిలో దిగిన నరహరి ఈత కొడుతూ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయి మృతి చెందాడు. మరో విద్యార్థి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి స్వస్థలం సూర్యాపేట. చదువు పూర్తవగానే.. మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉంటాడని, కష్టాలు తీరుస్తాడని అనుకున్న తల్లిదండ్రులు నరహరి మృతితో కుప్పకూలిపోయారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







