కోలీవుడ్ హస్యనటుడు సంతానంకు ఊరట.!
- October 13, 2017
కోలీవుడ్ హస్యనటుడు సంతానంకు చెన్నై హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సంతానంకు, బిల్డింగ్ కాంట్రాక్టర్ షణ్ముగసుందరంనకు మధ్య ఆర్ధిక లావాదేవీల సమస్య కారణంగా గత సోమవారం వాగ్వాదం జరిగి అది కొట్టుకునే వరకూ దారి తీసింది. ఆ గొడవల్లో షణ్ముగంతో పాటు, అతని స్నేహితుడు, న్యాయవాది, బీజేపీ నాయకుడు ప్రేమానందన్ గాయాలపాలైన సంగతి విదితమే. దీంతో న్యాయవాది ప్రేమానందన్ స్థానిక వలసరవాక్కం పోలీస్‌స్టేషన్‌లో సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదు చేయడంతో అతను అజ్ఙాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
కాగా సంతానం ముందస్తు బెయిల్ కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ న్యాయమూర్తి ఆదిత్యన్ సమక్షంలో విచారణకు రాగా రెండు రోజులుగా వాయిదా వేస్తూ వచ్చారు. శుక్రవారం మరోసారి విచారణకు రాగా గాయాల పాలైన న్యాయవాది ప్రేమానందన్ ప్రభుత్వ ఆస్పత్తిలో చేరారా?లేదా? అన్న వివరాలను విచారించి కోర్టుకు అందించాల్సిందిగా వలసర వాక్కం పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ నటుడు సంతానంకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే సంతానం రెండు వారాల పాటు రోజూ వలసరవాక్కం పోలీస్‌స్టేషన్‌లో క్రమం తప్పకుండా సంతకం చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







