కార్గో నౌక మునక, 11మంది భారతీయులు గల్లంతు
- October 13, 2017
ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ ధాటికి సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని జపనీస్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. కార్గో నౌకలో 26 మంది భారతీయులు ఉన్నారు. టైఫూన్ కారణంగా సముద్రమంతా అల్లకల్లోలంగా మారడంతో నౌక మునిగిపోయింది. 26 మందిలో 15 భారతీయ సిబ్బందిని సురక్షితంగా కాపాడగలిగారు. మిగతా 11 మంది గల్లంతయ్యారు. రెండు పెట్రోల్ బోట్స్, మూడు విమానాల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. టైఫూన్ కారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో గాలింపు చర్యలు కష్టమైనట్లు జపనీస్ కోస్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపారు. మునిగిపోయిన నౌక 33,205 టన్నుల బరువు ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







