నవంబర్‌లో హైదరాబాద్‌కు రానున్న ఇవాంక ట్రంప్.!
- October 14, 2017
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక నవంబర్‌లో హైదరాబాద్‌కు రానుంది నగరంలో రెండురోజులపాటు ఆమె స్టే చేయనున్నారు. దీంతో ఆమె ఎక్కడ బస చేస్తారనే రకరకాల ఊహాగానాలు. తొలుత తాజ్ ఫలక్‌నుమాలో వుంటారని వార్తలు పెద్ద ఎత్తున హంగామా చేశాయి. ఐతే, డెలిగేట్స్ ఎక్కడ బస చేస్తారనే దానిపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. మాదాపూర్‌లోని రహేజా ఐటీ పార్కులోగల వెస్టిన్ హైదరాబాద్ మైండ్‌స్పేస్ హోటల్‌లో తన సిబ్బందితో కలిసి ఇవాంక ట్రంప్ వుంటారని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. నవంబర్ 28, 29న హైదరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







