లాటిన్‌ అమెరికాతో చైనా బంధం

- October 14, 2017 , by Maagulf
లాటిన్‌ అమెరికాతో చైనా బంధం

బీజింగ్‌: లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దీవులు చైనాకు ఆకర్షణీయమైన ప్రాంతంగా మారిన నేపథ్యంలో లాటిన్‌ అమెరికా ఖండం సంస్కృతీ సాంప్రదాయాలు అర్థం చేసుకోవడానికి కృషి చేస్తోంది. లాటిన్‌ ప్రాంత భాష పట్ల ఆసక్తి ప్రదర్శిస్తోంది. 2వేల సంవత్సరం నుండి చైనా-లాటిన్‌ అమెరికా సంబంధాలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. రాజకీయ చర్చల విస్తరణ, పటిష్టమైన ఆర్థిక సంబంధాలు వుండడంవల్ల పలువురు చైనీయులు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి దోహదపడింది. ప్రస్తుతం లాటిన్‌ అమెరికా ఖండాన్ని అధ్యయనం చేయడానికి చైనాలో 50కి పైగా సంస్థలు పనిచేస్తున్నాయి.20వ శతాబ్దం ముగియడానికి ముందుగా కేవలం మూడే సంస్థలు వుండేవని లాటిన్‌ అమెరికా అధ్యయనాల చైనా శాస్త్రీయ అకాడమీ (ఐఎల్‌ఎఎస్‌) కి చెందిన గుయో చున్హారు తెలిపారు. ఈ సంస్థ చేసే పరిశోధనలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రైవేటు సంస్థలకు అందుబాటులో వుంటాయి. ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందడం, ప్రపంచానికి మరోవైపు గురించి తెలుసుకోవాలనే ఆత్రుత కొత్త తరంలో పెరగడం, ఇటువంటి పరిశోధనలను గణనీయంగా పెంచేందుకు చైనా ప్రభుత్వ ఆకాంక్ష ఇవన్నీ కూడా ఈ మార్పునకు కారణమని గుయో తెలిపారు. అనేక ఏళ్ళ కిందట స్పెయిన్‌, ఇతర ఆంగ్ల భాష మాట్లాడే దేశాలు చైనాకు, లాటిన్‌ అమెరికా, కరేబియా దీవుల మధ్య సంబంధాలకు మెరుగుపడేందుకు మధ్యవర్తిగా వ్యవహరించేవి. ఈ వైఖరి ఇంకా నెలకొని వుందని గుయో తెలిపారు.

లాటిన్‌ అమెరికా, కరేబియా దీవులపై అధ్యయనానికి సంబంధించి చైనాలో మార్పు చోటు చేసుకుంది. గతంలో ఈ ప్రాంతం గురించి తెలుసుకోవాలంటే అమెరికా, యూరప్‌ లేదా ఇతర దేశాల్లో రాసిన శాస్త్రీయమైన వ్యాసాలను తర్జుమా చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఆ ప్రాంతానికి చెందిన మేథావులు, విద్యావేత్తలు, విద్యా ప్రచురణల నుండి తీసుకోవడం ద్వారా ఈ ధోరణి మారుస్తున్నామని గుయో చెప్పారు. గతంలో ఈ ఖండంపై పరిశోధనలకు ప్రాధమిక ప్రయోజనం కేవలం రాజకీయంగానే వుండేది కానీ విద్యపరంగా వుండేది కాదు.

కానీ ఇప్పుడు ఈ రెండు రంగాల మధ్య సమతుల్యత పాటించబడుతోంది. స్పానిష్‌, పోర్చుగీస్‌ల బోధన కూడా పటిష్టమవుతోంది. చైనా విద్యా శాఖ మంత్రి అందచేసిన వివరాల ప్రకారం వందకి పైగా యూనివర్శిటీల్లో 30వేల మందికి పైగా విద్యార్థులు స్పానిష్‌ కోర్సుల్లో చేరారు. 1999లో స్పానిష్‌ను కేవలం 12 సంస్థల్లో మాత్రమే భోదించారు.

ఇప్పుడు ఇంగ్లీష్‌ తర్వాత స్పానిష్‌ రెండో ప్రజాదరణ పొందిన భాషగా మారింది. చైనాలో స్పానిష్‌ బోధనకు 1952 నుండి అధికారికంగా మద్దతు వుంది. ప్రధానమైన ముందడుగు పడినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా వుందని మాత్రం మెజారిటీ పరిశోధకులు, విద్యావేత్తలు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com