అజయ్ 'స్పెషల్'.!
- October 15, 2017
అ జయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'స్పెషల్'. ది స్టోరీ ఆఫ్ ఎ మైండ్ రీడర్... అనేది ఉపశీర్షిక. రంగ, అక్షత, సంతోష నాయకానాయికలు. వాస్తవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. శనివారం కూకట్పల్లి సమీపంలోని పదహారంతస్తుల భవంతిపై యాక్షన్ దృశ్యాలను చిత్రీకంచారు. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకనిర్మాత మాట్లాడుతూ ''ప్రేమ, పగ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. కథ, కథనాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే 'స్పెషల్' అనే పేరుని ఖరారు చేశాం. డేవిడ్ ముఖాన్తో పాటు, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వార్నర్ రాసిన పుస్తకాల్లోని అంశాలను ప్రేరణగా తీసుకుని ఈ కథని తయారు చేశా. డిసెంబర్‌కల్లా చిత్రాన్ని సిద్ధం చేస్తామ''న్నారు. అజయ్ మాట్లాడుతూ ''కథలో కొత్తదనం ఉంది. దర్శకుడు ఆసక్తికరంగా చిత్రీకస్తున్నారు. కేసుని పరిశోధించే ఓ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నా'' అన్నారు. అశోక్ కుమార్, అమర్ కుమార్, ఎన్వీయస్ మణ్యం పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







