సౌదీలో మహిళలు కారు డ్రైవింగ్ చేస్తే సహించని పురుషాహంకారులు
- October 15, 2017
సౌదీఅరేబియా: ' రాజు వరమిచ్చినా....చాంధసవాదులు మహిళలు కారు నడిపేందుకు ససమేరా ఒప్పుకోవడం లేదు. వారి కార్లకు అడ్డం పడి అసహ్యకరమైన మాటలతో కొందరు స్త్రీలను బాధిస్తున్నారు. కారు డ్రైవింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ సౌదీ ప్రభుత్వం ఇటీవల చారిత్రక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం కొంతమంది పురుషాహంకారులకు మింగుడు పడటం లేదు. వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆడవాళ్లు ఒంటరిగా కార్లు నడపకూడదంటూ ఏకంగా వారి వాహనాలకు అడ్డం పడిపోతున్నారు. తాజాగా సౌదీలో జరిగిన ఒక సంఘటన వైరల్గా మారింది. సౌదీలో ఒక మహిళ ఒంటరిగా కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆమెను దారుణమైన అసహ్యకరమైన పరుషపదాలతో తిట్టడం మొదలుపెట్టాడు. కారు డ్రైవింగ్ చేస్తున్న ఆ మహిళ కారు విండో దగ్గరగా వెళ్లి మరీ వీడియో తీశాడు. అది గమనించి మహిళ వెంటనే కారు విండోగ్లాసును పైకెత్తింది. వీడియో వైరల్ కావడంతో వీడియో తీసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







