ఐర్లాండ్, బ్రిటన్‌ల వైపుగా ముంచుకొస్తున్నఅరుదైన అట్లాంటిక్ హరికేన్
- October 15, 2017
తూర్పు అట్లాంటిక్ మహాసముద్రంలో జనించిన హరికేన్లలో అతిపెద్దదిగా భావిస్తున్న ఒఫెలియా.. బ్రిటన్, ఐర్లాండ్‌ల వైపు కదులుతోంది. పోర్చుగల్‌కు చెందిన అజోర్స్ దీవుల్లో శనివారం ఇది భారీ వర్షాలు కురిపించింది. అయితే ఇక్కడ పెద్దగా నష్టమేమీ సంభవించలేదు. ఐర్లాండ్, బ్రిటన్‌లను చేరుకునే సరికి ఇది మరింత బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ భవనాలను ధ్వంసం చేయగల శక్తి దీనికి ఉంటుందని.. వరదలు, సముద్రంలో ప్రమాదకర పరిస్థితులకు కారణం అవ్వొచ్చని అన్నారు. ఇప్పటివరకూ తూర్పు అట్లాంటిక్‌లో జనించిన హరికేన్లలో ఒఫెలియానే శక్తిమంతమైనదని.. 1939 తర్వాత ఉత్తరం వైపుగా ఇంతదూరం వచ్చిన మొదటి హరికేన్ అని నిపుణులు చెప్పారు. ఐర్లాండ్‌లోని ఐదు కౌంటీల్లో, బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం నుంచి మంగళవారం వరకు ప్రభుత్వాలు అప్రమత్తత విధించాయి. గంటకు 130 కి.మీ.ల వేగంతో గాలులు వీయొచ్చని అంచనా వేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







